‘ఆటలోనే కాదు.. ఆలోచనలోనూ తోపే’

18 Mar, 2019 18:42 IST|Sakshi

న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)-2019 సందడి మరి కొద్దిరోజుల్లోనే  ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆటగాళ్లు తమ జట్లతో చేరి ప్రాక్టీస్‌ మొదలెట్టేశారు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ యువ సంచలన ఆటగాడు రిషభ్‌ పంత్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆటగాడిగా పంత్‌ ఎంతో పరిణతి చెందాడని పేర్కొన్నాడు. మైదానంలో కీపింగ్‌ చేసేటప్పుడు.. బ్యాటింగ్‌ చేసేటప్పుడు అతడు ఆలోచించే విధానం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నాడు. అన్నింటికి మించి గెలవాలన్న తపన పంత్‌లో ఎక్కువగా ఉంటుందన్నాడు.
(కోహ్లి.. ఆలస్యంగా రాకు: ధోని)
ప్రస్తుతం యువ ఆటగాళ్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ దుర్భేధ్యంగా ఉందన్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌, పృథ్వీ షాలకు తోడు శిఖర్‌ ధవన్‌ జట్టుకు అదనపు బలమంటూ వివరించాడు. సహాయక కోచ్‌గా సౌరవ్‌ గంగూలీ నియామకవడం ఆనందంగా ఉందన్నాడు. అతడి శిక్షణలో యువ ఆటగాళ్లు మరింత రాటుదేలుతారని అభిప్రాయం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలలో క్యాపిటల్స్‌ చాలా బ్యాలెన్డ్స్‌గా ఉందన్నాడు. అభిమానులు అత్యున్నతమైన ప్రదర్శనను ఢిల్లీ నుంచి ఆశించవచ్చన్నాడు.
(బుమ్రాపై కోహ్లి ఆగ్రహం‌‌..)
ఇక గతేడాది ఐపీఎల్‌లో అత్యధిక పరగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పంత్‌(684) రెండో స్థానంలో ఉన్నాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో అప్పటి సన్‌ రైజర్స్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌(735) తొలి స్థానంలో ఉన్నాడు. మార్చి 23న జరిగే తొలి పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. 
(ధోని( vs) కోహ్లి)

మరిన్ని వార్తలు