మెల్బోర్న్: ఘోరమైన ప్రదర్శనతో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్లో పెను మార్పులకు అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చీఫ్ సెలక్టర్ రాడ్నీ మార్ష్ తప్పుకోగా, తాత్కాలిక సెలక్టర్‌గా గ్రెగ్ చాపెల్‌ను ఎంపిక చేశారు. ఈ క్రమంలో మరికొన్ని మార్పులు జరగవచ్చని సమాచారం. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అతని మాజీ సహచరుడు డామియెన్ మార్టిన్ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తోంది. ‘ఆస్ట్రేలియా దిగ్గజం ఒకరు ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ కోచ్‌గా తప్పుకున్నారు. త్వరలో పెద్ద ప్రకటన వెలువడవచ్చు’ అని మార్టిన్ వ్యాఖ్యానించాడు. సెలక్టర్‌గా గానీ కోచ్‌గా కానీ పాంటింగ్ వచ్చే అవకాశం ఉంది.