ఫుట్‌బాల్ సెమీస్‌లో బ్రెజిల్

15 Aug, 2016 02:32 IST|Sakshi
ఫుట్‌బాల్ సెమీస్‌లో బ్రెజిల్

రియో డి జనీరో: బ్రెజిల్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ నెయ్‌మార్ ఎట్టకేలకు ఒలింపిక్స్‌లో గోల్స్ ఖాతా తెరిచాడు. దీంతో శనివారం కొలంబియాతో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఆతిథ్య జట్టు 2-0తో గెలిచింది. బుధవారం జరిగే సెమీస్‌లో బ్రెజిల్ జట్టు హోండురస్‌తో ఆడుతుంది. ఇప్పటిదాకా అంతగా ఆకట్టుకోలేకపోతున్న నెయ్‌మార్ కీలక మ్యాచ్‌లో మాత్రం చెలరేగాడు. ఆట ప్రారంభమైన 12వ నిమిషంలోనే 25 గజాల దూరం నుంచి ఫ్రీ కిక్ ద్వారా జట్టుకు ఆధిక్యం అందించాడు. ద్వితీయార్ధం 83వ నిమిషంలో లువాన్ మరో గోల్‌తో బ్రెజిల్ విజయం సాధించింది. మరో సెమీస్‌లో ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టు నైజీరియాతో తలపడుతుంది.


 అథ్లెటిక్స్
 పురుషుల ట్రిపుల్ జంప్
 రంజిత్ మహేశ్వరి
 సమయం: సాయంత్రం 6.00 గంటల నుంచి
 మహిళల 200మీ.
 శ్రబాని నందా
 సమయం: సాయంత్రం 6.05 గంటల నుంచి
 మహిళల 3000మీ.
 స్టీపుల్ చేజ్ ఫైనల్
 లలితా బాబర్
 సమయం: రాత్రి 7.45 గంటల నుంచి
 బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్
 పురుషుల మిడిల్‌వెయిట్ 75 కేజీ
 వికాస్ క్రిషన్ x బెక్టెమిర్ (ఉజ్బెకిస్తాన్)
 సమయం: మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి
 రెజ్లింగ్
 పురుషుల గ్రీకో రోమన్ 85కేజీ (క్వాలిఫికేషన్)
  రవీందర్ ఖత్రి
 సమయం: సాయంత్రం 6.30 గంటల నుంచి
 బ్యాడ్మింటన్
 మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్
 సమయం: మంగళవారం తెల్లవారుజాము 3.00 గంటల నుంచి
 
 స్టార్ స్పోర్ట్స్ 1,2లలో
 పోటీలన్నీ  ప్రత్యక్ష ప్రసారం

>
మరిన్ని వార్తలు