'భారత గోల్ఫ్పై ప్రభావం చూపే అవకాశం'

17 Jul, 2016 16:42 IST|Sakshi
'భారత గోల్ఫ్పై ప్రభావం చూపే అవకాశం'

ట్రూన్: దాదాపు శతాబ్దం తరువాత ఒలింపిక్స్లో  గోల్ఫ్ ను ప్రవేశపెట్టడంతో పలువురు దిగ్గజ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. భారత్ నుంచి పురుషుల విభాగంలో ఇద్దరు గోల్ఫ్ కు ప్రాతినిథ్యం వహిస్తుండగా, మహిళల ఈవెంట్ నుంచి ఒక అథ్లెట్ మాత్రమే బరిలోకి దిగుతుంది. అయితే దీనిపై భారత ప్రధాన గోల్ఫర్ అనిర్బాన్ లహిరి హర్షం వ్యక్తం చేశాడు. రియో ఒలింపిక్స్ లో భారత తరపున పతకం సాధిస్తే అది కచ్చితంగా దేశంలో ఉన్న గోల్ఫ్ క్రీడపై ప్రభావం చూపుతుందన్నాడు. 'నేను పతకంతో తిరిగి భారత్ కు రావాలనుకుంటున్నా. పతకం కోసం తీవ్రంగా పోరాడతాం. పురుషుల విభాగంలో నాతో పాటు చవ్రారాసియా కూడా బాగానే రాణిస్తున్నాడు. ఒకవేళ మేము మెరుగ్గా రాణించి ఒలింపిక్స్లో పతకం సాధిస్తే మాత్రం అది భారత్లోని గోల్ఫ్పై ప్రభావం చూపుతుంది 'అని అనిర్బానీ అభిప్రాయపడ్డాడు.

1904లో ఒలింపిక్స్లో గోల్ఫ్ను చివరిసారి ప్రవేపెట్టారు. ఆ తరువాత ఒలింపిక్స్లో గోల్ఫ్ క్రీడ అనేది లేకుండా పోయింది. అయితే 112 సంవత్సరాల తరువాత గోల్ఫ్ను ఒలింపిక్స్లో పెట్టారు. ఆసియా నుంచి 16 మంది గోల్ఫర్లు ఒలింపిక్స్ కు సిద్ధమవుతుండగా, భారత్ నుంచి ముగ్గురికి అవకాశం దక్కడం విశేషం. భారత నుంచి మహిళల విభాగంలో అదితి అశోక్ పాల్గొంటుంది. అయితే జికా వైరస్ కారణంగా వరల్డ్ నంబర్ వన్ గోల్ఫర్ జాసన్ డే, వరల్డ్ నంబర్ టూ గోల్ఫర్ జోర్డాన్ స్పెత్లు రియో ఒలింపిక్స్ నుంచి వైదొలిగారు.

మరిన్ని వార్తలు