రిషభ్‌ పంత్‌ ప్రాక్టీస్‌..

15 Jun, 2019 19:41 IST|Sakshi

మాంచెస్టర్‌: వరల్డ్‌కప్‌లో శిఖర్‌ ధావన్‌కు గాయం కావడంతో ‘స్టాండ్‌ బై’ ఆటగాడిగా ఇంగ్లండ్‌ చేరుకున్న భారత యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అప్పుడే ప్రాక్టీస్‌ మొదలుపెట్టేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్‌ గాయ పడటంతో ఉన్నపళంగా ఇంగ్లండ్‌కు పయనమైన పంత్‌.. శనివారం మాంచెస్టర్‌లో భారత క్రికెట్‌ జట్టు సభ్యులను కలిశాడు. దీనిలో భాగంగా కాసేపు ప్రాక్టీస్‌ కూడా చేసేశాడు. ఈ క‍్రమంలోనే ఎంఎస్‌ ధోనిని అడిగి కొన్ని సలహాలు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

నిజానికి ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన 15మందితో కూడిన భారత జట్టులో పంత్‌కు చోటు దక్కలేదు. కాగా, స్టాండ్‌ బై ఆటగాడిగా రిషభ్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, ధావన్ గాయం బారినపడడంతో పంత్‌కు పిలుపొచ్చింది. దీంతో వెంటనే లండన్ పయనమైన పంత్‌ శుక్రవారం మాంచెస్టర్ చేరుకున్నాడు. రేపు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం లేకపోయినప్పటికీ ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్‌ చేయడం ఆకట్టుకుంది. ధావన్‌కు అయిన గాయం చిన్నపాటిదే కావడంతో అతన్ని జట్టుతోనే కొనసాగించాలనే భారత యాజమాన్యం నిర్ణయించింది. కాగా, రిషభ్‌ కూడా అందుబాటులో ఉంటే మంచిదనే నిర్ణయంతో అతన్ని ఇంగ్లండ్‌కు హుటాహుటీనా పంపింది. ప్రస్తుతం ధావన్‌ ఇంకా జట్టులో సభ్యుడిగానే ఉండటంతో పంత్‌ కేవలం స్టాండ్‌ బై ఆటగాడు మాత్రమే.


 

మరిన్ని వార్తలు