వారెవ్వా రిషబ్‌.. సూపర్‌ సెంచరీ

11 Sep, 2018 20:34 IST|Sakshi

సెంచరీతో చెలరేగిన రిషబ్‌ పంత్‌

విజయం దిశగా టీమిండియా

విజయానికి 166 పరుగుల దూరంలో భారత్‌

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ సెంచరీతో చెలరేగాడు. దీంతో ఓటమి అంచుల్లోకి వెళ్లిన టీమిండియా అద్భుత పోరాట పటిమన ప్రదర్శిస్తొంది. కేవలం రెండు పరుగులకే ధావన్‌, కోహ్లి, పుజారా వికెట్లు కోల్పొయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌.. ప్రస్తుతం 298/5తో నిలిచి గెలుపు దిశగా పయనిస్తోంది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మెరుపు ఇన్సింగ్స్‌తో (142), యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌(101, 118 బంతుల్లో) సెంచరీలతో చెలరేగిపోయారు. మొదటి నుంచి దూకుడుగా ఆడిన పంత్‌ ఇంగ్లండ్‌ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.

ఈ క్రమంలో కెరీర్‌లో మొదటి శతకానికి అందుకున్నాడు. ప్రస్తుతం ఇండియా విజయానికి ఇంకా 166 పరుగులు చేయాల్సిఉంది. చివరి సెషన్‌ కాబట్టి వికెట్లు కాపాడుకుంటూ ఇదే వేగాన్ని కొనసాగిస్తే భారత్‌కు అద్భుత విజయం దక్కుతుంది.  

మరిన్ని వార్తలు