ధోని రికార్డును బ్రేక్‌ చేసిన పంత్‌

17 Dec, 2018 13:22 IST|Sakshi

పెర్త్‌:  ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా అడుగుపెట్టిన టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ వరుస రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో ఏకంగా 11 క్యాచ్‌లతో ప్రపంచ రికార్డును సమం చేసిన  పంత్..  పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత కీపింగ్ దిగ్గజం ఎంఎస్ ధోని రికార్డును బద్దలుకొట్టాడు. ఆసీస్‌తో ఒక ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. ఆతిథ్య ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్ షమీ బౌలింగ్‌లో షాన్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో 15 ఔట్లలో పంత్  భాగస్వామ్యమయ్యాడు.

దీంతో గతంలో ఒకే టెస్టు సిరీస్‌లో 14 మంది ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఔట్లలో భాగంగా నిలిచిన భారత కీపర్లు ఎంఎస్‌ ధోని, వృద్ధిమాన్‌ సాహా, సయ్యద్ కిర్మాణీలను రికార్డును పంత్‌ సవరించాడు. ఆసీస్‌తో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మూడు క్యాచ్‌లు అందుకున్న పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా మరో మూడు క్యాచ్‌లను పట్టుకున్నాడు. దాంతో ఈ సిరీస్‌లో పంత్‌ పట్టిన క్యాచ్‌ల సంఖ్య 17కు చేరింది.

మరిన్ని వార్తలు