‘సెంచరీ చేయనందుకు బాధ లేదు’

4 May, 2017 16:00 IST|Sakshi
‘సెంచరీ చేయనందుకు బాధ లేదు’

కోల్‌కతా: సెంచరీ చేయడం కంటే జట్టును గెలిపించడమే ముఖ్యమని రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠి అన్నాడు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించడం తనకు ఇష్టమని తెలిపాడు. ఏడు పరుగుల తేడాతో ఐపీఎల్‌లో తొలి సెంచరీ చేజారడం పట్ల తనకు ఎటువంటి విచారం లేదన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో త్రిపాఠి 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. ‘ఈ రోజు బాగా ఆడాను. చివరి వరకు క్రీజ్‌లో ఉండాలనుకున్నాడు. సెంచరీ కోల్పోయినందుకు నాకు ఎటువంటి బాధ లేదు. మ్యాచ్‌ గెలవడం అన్నిటికంటే ముఖ్యం. ఎటువంటి ప్రణాళికలు వేసుకోకుండానే బ్యాటింగ్‌కు దిగాను. ఎంఎస్‌ ధోని, స్టీవ్‌ స్మిత్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లతో ఆడడం నాకెంతో ఉపకరించింది. రహానేతో ఓపెనింగ్‌కు రావడం అద్బుతమైన అనుభవం. రహానే నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. మైదానం వెలుపల కూడా సహచర ఆటగాళ్లు ఎంకరేజ్‌ చేశార’ని త్రిపాఠి వెల్లడించాడు.

మరిన్ని వార్తలు