ఆర్చరీలో సత్తా చాటిన రితురాజ్, హర్షిత

3 Sep, 2016 10:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ స్కూల్ ఆర్చరీ పోటీల్లో రితురాజ్, హర్షిత సత్తాచాటారు. ఇండియన్ రౌండ్ ఆర్చరీ అండర్- 17 విభాగంలో విజేతలుగా నిలిచారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతోన్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో కృష్ణవేణి హైస్కూల్‌కు చెందిన రితురాజ్ సింగ్, ఎన్. కృష్ణ సారుు తొలి రెండు స్థానాల్లో నిలవగా... సుజాత హైస్కూల్‌కు చెందిన మొహమ్మద్ ఖాజా, అబ్దుల్ వహీద్‌లు మూడు, నాలుగు స్థానాల్ని దక్కించుకున్నారు. బాలికల విభాగంలో శంకర్ జీ మెమోరియల్ హైస్కూల్‌కు చెందిన హర్షిత, రోసరీ కాన్వెంట్‌కు చెందిన షేక్ రహీమా, జెడ్పీహెచ్‌కు చెందిన హిమ మాన్సి తొలి మూడు స్థానాల్ని దక్కించుకున్నారు.

 

అండర్ -14 విభాగంలో జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ సత్తా చాటింది. బాలుర విభాగంలో తొలి మూడు స్థానాల్ని కైవసం చేసుకుంది. సారుు ఉజ్వల్, జిష్ణు, సారుు మనీష్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో ఉన్నారు. బాలికల విభాగంలో ఊర్వశి (కృష్ణవేణి హైస్కూల్) చాంపియన్‌గా నిలవగా... జినిషా (సెరుుంట్ ఆంథోని హైస్కూల్) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. స్వాతి ధన్య (బీవీబీపీఎస్) మూడో స్థానంలో ఉంది. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో చాదర్‌ఘాట్‌లో జరిగిన ఎరుుర్‌రైఫిల్ పోటీల విజేతలు

అండర్-14 బాలురు: 1. ఎస్. సాత్విక్ (డీపీఎస్), 2. సయ్యద్ అలీ (హిదాయత్ హైస్కూల్), 3. చిన్మయ ఆరోరా (బీవీబీపీఎస్).
 అండర్-17 బాలురు: 1. కె. సారుు ప్రజ్వల్ (లిటిల్ ఫ్లవర్ స్కూల్), 2. శివెక్ అగర్వాల్ (బీవీబీపీఎస్), 3. డి. సుజయ్ (బీవీబీపీఎస్).
 బాలికలు: 1. బి. హరిత (జీబీహెచ్‌ఎస్), 2. హరిచందన (సెరుుంట్ జోసెఫ్ హైస్కూల్), 3. శ్రీష్మ (బీవీబీపీఎస్).

 

మరిన్ని వార్తలు