భారత మహిళా హాకీ కెప్టెన్పై వేటు?

9 Jul, 2016 18:20 IST|Sakshi
భారత మహిళా హాకీ కెప్టెన్పై వేటు?

న్యూఢిల్లీ:త్వరలో రియో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత మహిళా హాకీ జట్టు నుంచి కెప్టెన్ రీతూ రాణిని తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల కాలంలో రీతూ రాణి ప్రదర్శన, తీరు కూడా  హాకీ ఇండియాకు నచ్చకపోవడంతో రియోకు వెళ్లే భారత జట్టు నుంచి తప్పించడానికి నిర్ణయించారు.  మరో మూడు రోజుల్లో 16 మంది క్రీడాకారిణులతో కూడిన మహిళా హాకీ జట్టును ప్రకటించే నేపథ్యంలో రీతూ రాణి తొలగింపు దాదాపు ఖాయంగానే కనబడుతోంది. ఈ మేరకు జట్టు మేనేజ్మెంట్లోని సీనియర్ సభ్యుడు ఒకరు ఒలింపిక్స్కు రీతూరాణిని ఎంపిక చేయడం లేదని ముందుగానే సంకేతాలిచ్చారు.

'అవును మీరు విన్నది నిజమే. రియోకు వెళ్లే భారత మహిళా హాకీ జట్టులో రీతూకు స్థానం కల్పించడం లేదు. ఇందుకు రీతూ ప్రదర్శనతో పాటు, ఆమె ప్రవర్తన కూడా బాలేదు. ఈ విషయాన్ని ఆమెకు చాలా సార్లు చెప్పాం. అయినప్పటికీ ఆమె ఆటలో, తీరులో ఏమాత్రం మార్పులేదు.  ప్రస్తుతం మహిళా హాకీ క్యాంప్ బెంగళూరులో నిర్వహిస్తున్నాం. మరో రెండు రోజుల్లో ఢిల్లీలో క్యాంప్ ఉంటుంది. అందులో రీతూ ఉండకపోవచ్చు'అని తెలిపారు. భారత మహిళా హకీ జట్టు 36 సంవత్సరాల తరువాత ఒలింపిక్స్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. చివరిసారి 1980లో ఒలింపిక్స్కు వెళ్లిన మహిళా జట్టు దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఒలింపిక్స్కు పాల్గొనబోతుంది. రియోకు అర్హత సాధించిన భారత మహిళా జట్టుకు రీతూ రాణినే కెప్టెన్ గా సారథ్యం వహించింది.

మరిన్ని వార్తలు