రిత్విక్ జోడీకి టైటిల్

12 Dec, 2016 14:25 IST|Sakshi
రిత్విక్ జోడీకి టైటిల్

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఈస్ట్ ఆఫ్రికా జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ సత్తా చాటాడు. బాలుర డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. ఫైనల్లో రిత్విక్ చౌదరీ (భారత్)- మాథ్యూ బెచర్ (గ్రేట్ బ్రిటన్) జోడీ 7-6 (7/4), 5-7, 10-2తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ కెవిన్ చెరియట్-షేల్ కొటెచా (కెన్యా) జంటపై సంచలన విజయం సాధించి విజేతగా నిలిచింది.

 

తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన రిత్విక్ జంట రెండో రౌండ్‌లో 7-5, 6-3తో నియిజెనా (రువాండా)-మొహమ్మద్ ఒమర్ (బురుండి) ద్వయంపై... క్వార్టర్ ఫైనల్లో 3-6, 6-3, 11-9తో జంకోవియాక్-మార్సిన్ (పోలాండ్) జంటపై, సెమీఫైనల్లో 6-3, 4-6, 11-9తో దేవ్ జవియా-కరణ్ శ్రీవాస్తవ (భారత్) జోడీపై గెలిచింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా