బాల్కనీ నుంచి దూకేద్దామనుకున్నా: ఊతప్ప

4 Jun, 2020 13:14 IST|Sakshi

బెంగళూరు: తాను క్రికెట్‌కు దూరమైన ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప తాజాగా తెలిపాడు. క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడకపోవడంతో ప్రతీ రోజూ నరకం అనుభవించేవాడినని, దాంతో చావే శరణ్యమని భావించేవాడినన్నాడు. రేపు భవిష్యత్తు ఏంటి అనే ఆలోచనలతో తీవ్రంగా సతమతమయ్యేవాడినని, దాంతో ఇంటి బాల్కనీ నుంచి దూకేద్దామని  అనుకున్నానన్నాడు.  రాయల్‌ రాజస్తాన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన మైండ్‌, బాడీ, సోల్‌ కార్యక్రమంలో మాట్లాడిన ఊతప్ప.. ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఎలా వచ్చిందో వివరించాడు. ‘నేను 2006లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేశా. అప్పుడు నా గురించి నాకు పెద్దగా తెలియదు. అప్పటి నుండి చాలా నేర్చుకోవడం ఆరంభించా. ప్రస్తుతం నా గురించి నాకు బాగా తెలుసు. నా ఆలోచనల్లో క్లారిటీ ఉంది. నేను కిందికి పడిపోతుంటే ఎలా పైకి వెళ్లాలనే దానిపై అవగాహన ఉంది. (ఇంత ఆటవికమా: రోహిత్‌ శర్మ)

నేను ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నానంటే చాలా అడ్డంకులు దాటుకుంటూ వచ్చాను. ఒకానొక సమయంలో పూర్తిగా  డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అప్పుడు సూసైడ్‌ చేసుకోవాలని అనుకుడేవాడిని. 2009 నుంచి 2011 మధ్యకాలంలో నరకం అనుభవించా. క్రమేపీ నాకు నేనుగా మెరుగుపడుతూ ఆ ఆలోచనలు నుంచి బయటకొచ్చా. ఇప్పుడు కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టడం లేదు. పలు విషయాలపై దృష్టి సారిస్తూ నా మనసును ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. నేను వెళ్లే మార్గం సరైనదా.. కాదా అని అన్వేషించుకుంటూ నా రోటీన్‌ లైఫ్‌లో ముందుకు సాగుతున్నా’ అని ఊతప్ప తెలిపాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు.(యువీకి సరికొత్త తలనొప్పి)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు