మూడో రౌండ్‌లో నాదల్‌

30 May, 2019 04:41 IST|Sakshi

ఫెడరర్, నిషికోరి కూడా

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌

పారిస్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో నాదల్‌ 6–1, 6–2, 6–4తో యానిక్‌ మాడెన్‌ (జర్మనీ)పై గెలిచాడు. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) 6–4, 6–3, 6–4తో ఆస్కార్‌ ఒట్టె (జర్మనీ)పై, ఏడో సీడ్‌ నిషికోరి (జపాన్‌) 4–6, 6–4, 6–4, 6–4తో సోంగా (ఫ్రాన్స్‌)పై, ఆరో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) 4–6, 6–0, 6–3, 7–5తో డెలియన్‌ (బొలీవియా)పై గెలిచారు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) 6–1, 7–6 (7/3)తో సోరిబెస్‌ (స్పెయిన్‌)పై, రెండో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–2, 6–2తో కుకోవా (స్లొవేకియా)పై, 12వ సీడ్‌ సెవస్తోవా (లాత్వియా) 6–2, 6–4తో మినెల్లా (లక్సెంబర్గ్‌)పై గెలిచారు.  

దివిజ్‌ జంట శుభారంభం: పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత డబుల్స్‌ స్టార్‌ ఆటగాళ్లు దివిజ్‌ శరణ్, రోహన్‌ బోపన్న జోడీలు శుభారంభం చేశాయి. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో దివిజ్‌–డెమోలైనర్‌ (బ్రెజిల్‌) ద్వయం 6–3, 4–6, 6–2తో ఫక్సోవిక్స్‌ (హంగేరి)–లిండ్‌స్టెడ్‌ (స్వీడన్‌) జోడీపై... బోపన్న–మరియస్‌ కోపిల్‌ (రొమేనియా) జంట 6–3, 7–6 (7/4)తో ఆరో సీడ్‌ మైకేల్‌ వీనస్‌ (న్యూజిలాండ్‌)–క్లాసెన్‌ (దక్షిణాఫ్రికా) జోడీపై గెలిచి రెండో రౌండ్‌కు చేరాయి.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా