ఫెడరర్‌... మళ్లీ నంబర్‌వన్‌ 

17 Jun, 2018 01:36 IST|Sakshi

స్టుట్‌గార్ట్‌ (జర్మనీ): స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఈ ఏడాది రెండోసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకోనున్నాడు. మెర్సిడెస్‌ ఓపెన్‌ టోర్నీలో ఫెడరర్‌ ఫైనల్‌కు చేరుకోవడంతో అతనికి నంబర్‌వన్‌ ర్యాంక్‌ ఖాయమైంది. సోమవా రం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో ఫెడరర్‌ అధికారికంగా నంబర్‌వన్‌ ర్యాంక్‌ను దక్కించుకుంటాడు.

2012 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో టాప్‌ ర్యాంక్‌ అందుకున్న ఫెడరర్‌... మే 14న స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌కు ఈ స్థానాన్ని కోల్పోయాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఫెడరర్‌ 6–7 (2/7), 6–2, 7–6 (7/5)తో నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా)తో ఫెడరర్‌ ఆడతాడు.   

మరిన్ని వార్తలు