టీమిండియా తొలిసారి..

3 Oct, 2019 10:57 IST|Sakshi

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తొలి రోజే శతకం చేయగా, రెండో రోజు మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సైతం సెంచరీ సాధించాడు. అత్యంత నిలకడగా ఆడిన మయాంక్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 203 బంతుల్లో సెంచరీ సాధించాడు మాయంక్‌. ఇది మయాంక్‌ అగర్వాల్‌కు తొలి టెస్టు సెంచరీ. ఫలితంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో సెంచరీ సాధించిన 86వ భారత్‌ ఆటగాడిగా మాయంక్‌ గుర్తింపు సాధించాడు. అయితే ఇద్దరు టీమిండియా ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు సాధించడం 10వసారి.

భారత్‌ తరఫున చివరిసారి ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌-మురళీ విజయ్‌లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు సాధించారు. 2018లో అఫ్గానిస్తాన్‌తో బెంగళూరులో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధావన్‌-విజయ్‌లు సెంచరీలు సాధించారు. కాగా, దక్షిణాఫ్రికాపై ఇద్దరు టీమిండియా ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి.  అయితే దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో ఇద్దరు ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం మాత్రం 10 ఏళ్ల తర్వాత ఇదే మొదటిది. 2009లో ఆసీస్‌ ఓపెనర్లు ఫిల్‌ హ్యూజ్‌-సైమన్‌ కాటిచ్‌ల జోడి చివరిసారి సఫారీలపై సెంచరీలు సాధించగా, ఆ తర్వాత భారత్‌ తరఫున మయాంక్‌-రోహిత్‌లు వారి సరసన చేరారు.(ఇక్కడ చదవండి: బ్రాడ్‌మన్‌ సరసన రోహిత్‌!)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు