రోహిత్‌ భయ్యా.. అంతకంటే హ్యాపీ ఏముంది?: రిషభ్‌

10 Jan, 2019 12:16 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఎక్కువ వార్తల్లో నిలిచిన క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారంటే అది రిషభ్‌ పంత్‌. అటు ఆట తీరుతో ఇటు స్లెడ్జింగ్‌తో మీడియాకు పని కల్పించాడు రిషభ్‌. ప‍్రధానంగా ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌-రిషభ్‌ పంత్‌ల మధ్య సాగిన స్లెడ్జింగ్‌ సిరీస్‌కే హైలైట్‌ కాగా, ఆపై పైన్‌ పిల్లల్ని ఆడించి ఒక మంచి బేబీ సిట్టర్‌గా కూడా పంత్‌ గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలోనే ఇటీవల తండ్రైన రోహిత్‌ శర్మ తన పాపను ఆడించాలంటూ పంత్‌కు ఆఫర్‌ చేశాడు. గుడ్‌ మార్నింగ్‌ అనే పంత్‌ ట్వీట్‌కు బదులిస్తూ.. ‘శుభోధయం బడ్డీ.. నీవు మంచి బేబీ సిట్టర్‌వని విన్నా. రితికాను సంతోషంగా ఉంచాలంటే నాకు ఓ బేబీ సిట్టర్‌ కావాలి అంటూ సరదాగా పేర్కొన్నాడు.

దీనిపై స‍్పందించిన రిషభ్‌ పంత్‌.. అంతకంటే హ్యాపీ ఏముంది అంటూ రోహిత్‌కు బదులిచ్చాడు.  రోహిత్‌ భయ్యా.. పాప సమైరాను ఆడించే జాబ్‌ను ఆనందంగా స్వీకరిస్తా అంటూ రిప్లై ఇచ్చాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో రిషభ్‌ పంత్‌ 20 క్యాచ్‌ల పట్టడంతో పాటు 350 పరుగులు చేశాడు. కాగా, వన్డే సిరీస్‌కు ఎంఎస్‌ ధోని అందుబాటులోకి రావడంతో రిషభ్‌ పంత్‌కు విశ‍్రాంతి ఇచ్చారు.

మరిన్ని వార్తలు