రోహిత్‌ ఎనిమిదోసారి..

18 Dec, 2019 17:02 IST|Sakshi

విశాఖ:  ఈ ఏడాది టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సాధించిన అంతర్జాతీయ సెంచరీలు 10.  అందుల్లో వన్డేల్లోనే రోహిత్‌ ఏడు శతకాలు సాధించడం విశేషం. మరొకవైపు ఈ క్యాలెండర్‌ ఇయర్‌ అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డును రోహిత్‌ సాధించాడు. ఇక్కడ సచిన్‌ టెండూల్కర్‌(9)ని వెనక్కినెట్టాడు. 1998లో సచిన్‌ 9 సెంచరీలు  సాధించాడు. ఆ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు.

2019లో ఐసీసీ టాప్‌-9 వన్డే ర్యాంకింగ్స్‌లో ఉన్న జట్లలో న్యూజిలాండ్‌ను మినహాయించి మిగతా అన్ని జట్లుపై రోహిత్‌ శతకాలు నమోదు చేయడం అతని అసాధారణ బ్యాటింగ్‌కు అద్దం పడుతుతోంది. ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగుల జాబితాలో కూడా రోహిత్‌ టాప్‌లోకి వచ్చేశాడు. ఈ ఏడాది వెస్టిండీస్‌పైనే రోహిత్‌ మూడు వన్డే శతకాలు నమోదు చేశాడు.  కాగా, వన్డేల్లో 150కిపైగా స్కోర్లు సాధించిన జాబితాలో రోహిత్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తన వన్డే కెరీర్‌లో రోహిత్‌ ఎనిమిదోసారి 150కి పైగా పరుగులు సాధించాడు. ఈ జాబితాలో డేవిడ్‌ వార్నర్‌(6) రెండో స్థానంలో ఉండగా, సచిన్‌ టెండూల్కర్‌-క్రిస్‌గేల్‌(5సార్లు) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు