చరిత్ర సృష్టించిన రోహిత్‌

6 Jul, 2019 21:38 IST|Sakshi

లీడ్స్‌ : టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. శనివారం శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రమైన చివరి లీగ్‌ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ శతకం బాది పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే నాలుగు సెంచరీలను తన ఖాతాలో వేసుకున్న రోహిత్‌ తాజాగా శ్రీలంకపై మరో శతకం సాధించాడు. దీంతో ఒక ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక సెంచరీలు(5) సాధించిన తొలి ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర పేరిట ఉన్న అత్యధిక సెంచరీల(4) రికార్డును తిరగరాశాడు. 

అంతేకాకుండా ప్రపంచకప్‌ లీగ్‌లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా రోహిత్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇదే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌(586) రికార్డ్‌ను షకీబుల్‌(606) బ్రేక్‌ చేశాడు. తాజాగా శ్రీలంక మ్యాచ్‌లో రోహిత్‌ షకీబుల్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక వరల్డ్‌ కప్‌లో 600పైకి పైగా పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడిగా మరో ఘనతను రోహిత్‌ అందుకున్నాడు. ఈ జాబితాలో సచిన్‌(673) తొలి స్థానంలో ఉన్నాడు. 


 

మరిన్ని వార్తలు