ఇంత ఆటవికమా: రోహిత్‌ శర్మ

4 Jun, 2020 12:03 IST|Sakshi

ముంబై: ఆకలితోనే కాకుండా గర్భంతో ఉన్న ఏనుగుకు  పైనాపిల్ బాంబును ఆహారంగా పెట్టి చంపిన ఘటనపై తీవ్ర స్థాయిలో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై   ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా స్పందించగా, టీమిండియా క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అమానుష ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని, ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్లు కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించాడు. ‘ గర్భంతో ఉన్న ఏనుగును చంపడం ఏదైతో ఉందో అది నన్ను భయాందోళనకు గురి చేసింది. ఈ వార్త విన్నవెంటనే కలవరపాటుకు గురయ్యా. జంతువుల్ని ప్రేమిద్దాం.. అంతేకానీ ఇలాంటి ఘోరాలకు పాల్పడవద్దు. దీనికి ఇకనైనా ముగింపు పలుకుదాం’ అని కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు.(ఏనుగు నోట్లో పైనాపిల్‌ బాంబ్‌)

‘ మనం క్రూరులమా.. ఇప్పటికీ ఏమీ నేర్చుకోకుండా ఆటవిక పరిస్థితుల్లో బ్రతుకుతున్నామా. ఏనుగును పైనాపిల్‌ బాంబు పెట్టి విన్న వార్తతో షాక్‌కు గురయ్యా. మూర్ఖత్వంతో జంతువులపై ఈ తరహా దారుణాలు సమంజసం కాదు’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. త నెల కేరళలో చోటు చేసుకున్న ఉదంతంపై మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.  మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిన ఈ వైనం పై యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. ఏనుగు బాధాకరమైన మరణం మానవాళి మొత్తాన్ని సిగ్గుపడేలా చేసింది. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో దీనిపై తమ వేదనను, భాధను  పంచుకుంటున్నారు. మరో ఏనుగు తీవ్ర గాయాలతో మరణించడంతో అది కూడా ఇలానే జరిగిందనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (అమానుష ఘటనపై రతన్ టాటా ఆవేదన)

Appalled to hear about what happened in Kerala. Let's treat our animals with love and bring an end to these cowardly acts.

A post shared by Virat Kohli (@virat.kohli) on

మరిన్ని వార్తలు