రోహిత్కు కెరీర్ బెస్ట్ ర్యాంక్

25 Jan, 2016 02:16 IST|Sakshi
రోహిత్కు కెరీర్ బెస్ట్ ర్యాంక్

దుబాయ్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో విశేషంగా రాణించిన భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదివారం విడుదల చేసిన తాజా జాబితాలో అతను ఎనిమిది స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతుండగా, కెప్టెన్ ధోని... ఏడు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు పడిపోయాడు. అజింక్య రహానే 25వ ర్యాంక్‌లో ఉన్నాడు. సిడ్నీలో జరిగిన ఆఖరి వన్డేలో గెలిచిన టీమిండియా... తమ రెండో ర్యాంక్‌ను పదిలం చేసుకుంది.

మరోవైపు ఆసీస్ ఆటగాళ్లు మ్యాక్స్‌వెల్, స్మిత్, వార్నర్, మిచెల్ మార్ష్‌లు వరుసగా 8, 15, 18, 43వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ రెండు స్థానాలు దిగజారి 11వ ర్యాంక్‌లో; భువనేశ్వర్ ఏడు స్థానాలు పడిపోయి 20వ ర్యాంక్‌లో ఉన్నాడు. జడేజా 22వ; అక్షర్ పటేల్ 33వ; ఉమేశ్ యాదవ్ 41వ; ఇషాంత్ శర్మ 71వ ర్యాంక్‌లను దక్కించుకున్నారు.

మరిన్ని వార్తలు