రోహిత్‌ సేన మెరిసేనా..? శ్రీలంకకు భారత జట్టు

4 Mar, 2018 20:15 IST|Sakshi

ముంబై:  శ్రీలంకలో జరుగనున్న ముక్కోణపు టీ 20 సిరీస్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్‌ జట్టు ఆదివారం శ్రీలంక చేరుకుంది. ఈ సిరీస్‌లో భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు పాల్గనున్నాయి. మార్చి 6న భారత్‌ తొలి మ్యాచ్‌ను ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో ఆడనుంది. ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పగా, శిఖర్‌ ధావన్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

హైదరాబాద్‌ పేసర్‌ మొహ్మద్‌ సిరాజ్‌కు మరోసారి అవకాశం లభించింది. యువ ఆటగాళ్లు దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, విజయ్‌ శంకర్‌, రిషబ్‌ పంత్‌లకు సైతం బీసీసీఐ అవకాశం కల్పించింది. వరుస సిరీస్‌లలో ఆడుతున్న కారణంగా భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోని, జస్ర్పిత్‌ బూమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌లకు కూడా విశ్రాంతినిచ్చారు.

శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత్‌ జట్టు ఇదే..
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సురేశ్‌ రైనా, మనీష్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, యజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, విజయ్‌ శంకర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జయదేవ్‌ ఉనాద్కత్‌, సిరాజ్‌, రిషబ్‌ పంత్‌

మరిన్ని వార్తలు