కూతురితో రోహిత్‌ ఏం చెప్పాడో తెలుసా?

18 Jul, 2020 13:10 IST|Sakshi

ప్రముఖ ఇండియన్‌ క్రికెటర్‌ రోహిత్ శర్మ శనివారం తన కుమార్తె సమైరాతో ఉన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో ప్లాస్టిక్‌కు నో చెప్పడం, సముద్రంపై వారికి ఉన్న  ప్రేమ గురించి ఈ వీడియోలో రోహిత్‌ ఆయన కూతురికి చెప్పారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన రోహిత్‌ నా ముచ్కిన్‌తో ఈ రోజు ఉదయం సముద్రం మీద మాకున్న ప్రేమ గురించి, ప్లాస్టిక్‌కు నో చెప్పడం గురించి మాట్లాడాను. చిన్నప్పుడే వారికి అన్ని నేర్పాలి అనే శీర్షికను జోడించాడు.  

చదవండి: ‘ఎంతో మెరుగయ్యా.. కానీ నా వైపు చూడలేదు’

ఈ వీడియోను షేర్‌ చేసిన వెంటనే రోహిత్‌ అభిమానులతో పాటు రోహిత్‌ సహచరుడు యజువేంద్ర చహల్‌ కూడా హార్ట్‌ సింబల్‌తో దానికి కామెంట్‌ పెట్టాడు. అదేవిధంగా పుట్‌బాల్‌లో రియల్ మాడ్రిడ్ అభిమాని అయిన రోహిత్, స్పానిష్ ఫుట్‌బాల్ దిగ్గజాలు 34 వ లాలిగా టైటిల్‌ను గెలుచుకున్నందుకు అభినందనలు తెలిపారు. 2007 లో ఐర్లాండ్‌తో వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ ఇప్పటివరకు 50 ఓవర్ల ఫార్మాట్‌లో 29 సెంచరీలు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు  రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. 

చదవండి: ఆ రెండింటిలోనూ ఆడాలని ఉంది: రోహిత్‌

Mornings with my munchkin ❤️ Discussing our love for the ocean and why it’s important to say no to plastic straws. Teach them young 🌊🐠🐟🐬🐳🐡

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా