ఆ బంతిని సిక్స్‌గా మలిచినందుకు థాంక్స్‌: రోహిత్

1 Jun, 2020 15:18 IST|Sakshi

టీమిండియా క్రికెటర్‌, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ నేడు 35వ ఏట అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా జట్టు సహచరులు, అభిమానుల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, క్రికెటర్లు అశ్విన్‌, హర్భజన్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా డీకేను విష్‌ చేశారు. ఇక హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మాత్రం..‘‘హ్యాపీ బర్త్‌ డే డీకే బాబా. ఆ చివరి బంతిని సిక్స్‌గా మలిచినందుకు ధన్యవాదాలు’’అంటూ నిదహాస్‌ ట్రోఫీ విజయంలో దినేశ్‌ కార్తిక్‌ హీరోగా నిలిచిన విషయాన్ని మరోసారి గుర్తుచేశాడు. ఐపీఎల్‌లో భాగంగా తాను ముంబై ఇండియన్స్‌ జెర్సీ, దినేశ్‌ కేకేఆర్‌ జెర్సీ ధరించి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు.(‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు)

కాగా 2018లో బంగ్లాదేశ్‌తో జరిగిన నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో డీకే అద్బుత ప్రదర్శనతో టీమిండియాను విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. ట్రోఫీ కైవసం చేసుకునేందుకు భారత్‌కు 3 ఓవర్లలో 35 పరుగులు అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో.. 8 బంతుల్లో 29 పరుగులు చేసి.. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్‌లో చివరి బంతిని సిక్స్‌గా మలిచి ప్రేక్షకులకు గొప్ప అనుభూతి అందించాడు. ఇక నిదహాస్‌ ట్రోఫీ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో కోహ్లి జట్టుకు దూరం కాగా.. రోహిత్‌ శర్మ సారథ్య బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అలా తన కెప్టెన్సీలో టీమిండియాకు డీకే అందించిన చిరస్మరణీయ విజయాన్ని రోహిత్‌ తన పుట్టినరోజు సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.  (నేను స్లెడ్జ్‌ చేస్తా.. నువ్వు కేవలం నవ్వు అంతే!)

Happy birthday Dk baba. Thanks for that last ball six 👌@dk00019

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు