అగ్గి రాజేసిన రోహిత్‌ ‘అన్‌ఫాలో’ వివాదం!

26 Jul, 2019 11:52 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు తలెత్తాయని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. విండీస్ పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని కోహ్లి భావించాడని.. కానీ రోహిత్‌కి కెప్టెన్సీని అప్పగించడం ఇష్టం లేకే మళ్లీ మనసు మార్చుకున్నాడని కూడా వార్తలు వినిపించాయి. ఈ వార్తలు తప్పని కూడా భారత క్రికెట్‌ కంట్రోల్‌(బీసీసీఐ) వర్గాలు పేర్కొన్నాయి. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. కోహ్లి, రోహిత్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయనేది నిజమేననిపిస్తోంది.

చాలా కాలం క్రితమే విరాట్ కోహ్లిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన రోహిత్ శర్మ.. ఇటీవలే కోహ్లి భార్య అనుష్క శర్మను అన్‌ఫాలో అయ్యాడు. దీంతో కోహ్లి, రోహిత్ శర్మ మధ్య తలెత్తిన విబేధాలు నిజమేనని భావిస్తున్నారు. అనుష్క శర్మను రోహిత్‌ అన్‌ఫాలో కావడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. తాజాగా రోహిత్‌ శర్మ, అతని భార్య రితికాలను కూడా అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కావడం లేదట. తనను, భర్త కోహ్లిని ఫాలో కానప్పుడు తాను ఎందుకు ఫాలో కావాలని భావించే అనుష్క శర్మ కూడా రోహిత్‌, రితికాలను అన్‌ఫాలో చేసిందట.

వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా ఓడిపోక ముందు వరకూ అంతా సవ్యంగా ఉన్నట్టుగానే కనిపించింది. కానీ కోహ్లిసేన సెమీస్‌లో అనూహ్యంగా ఓడటంతో ఒక్కసారిగా విబేధాలు బయటకొచ్చాయి. కాగా, కోహ్లి, రోహిత్ మధ్య విబేధాలు కొన్నేళ్ల క్రితమే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలతో కోహ్లి-రోహిత్‌లు ఎలా ఉన్నప్పటికీ, ఇది మాత్రం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా