‘నేనేం సచిన్‌ అభిమానిని కాదు’

8 Nov, 2017 16:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ‌: క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ను అభిమానించనవారు ఎవరుండరూ.. కానీ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదేళ్ల మాత్రం తనకు ఇష్టమైన క్రికెటర్‌ సచిన్‌ కాదంటున్నాడు. భారత్‌ పర్యటనలో ఉన్న సత్యనాదేళ్ల ఓ జాతీయ చానెల్‌ నిర్వహించిన కార్యక్రమంలో అడిగిన ర్యాఫిడ్‌ ఫైర్‌ ప్రశ్నకు ఇలా సమాదానం ఇచ్చాడు.

మీరు అభిమానించే క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌.. లేక 1960 దిగ్గజం హైదరాబాది క్రికెటర్‌ ఎంఎల్‌ జయసింహానా అని ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు సత్యనాదేళ్ల ఇది చాల కఠినమైన ప్రశ్న అని, నేను మాత్రం ఓ హైదరాబాదిగా జయసింహానే అభిమానిస్తానని తెలిపాడు. ఇక తన ‘హిట్‌ రిఫ్రేష్‌’ బుక్‌లో జయసింహా గురించిన ప్రస్తావించిన సత్యనాదేళ్ల ఓ సందర్భాన్ని వివరించారు. ఓ రోజు తన గదిలో తన తండ్రి కారల్‌ మార్క్స్‌ ఫొటోను తగిలించాడని, వెంటనే తన తల్లి లక్ష్మీదేవి ఫోటోను పెట్టిందని తాను మాత్రం తన హీరో జయసింహా ఫోటోనే కావలనుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక జయసింహా మైదానం బయట గుడ్‌ స్టైల్‌ లుకింగ్‌తో రాక్‌స్టార్‌లా ఉండేవాడని తెలిపాడు. 1959-1971 మధ్య కాలంలో 39 టెస్టులాడిన జయసింహా 2056 పరుగులు చేశాడు. మైదానంలో స్టైలీష్‌ బ్యాటింగ్‌తో రాణించేవాడు. ఆయన బ్యాటింగ్‌ శైలిని వీవీఎస్‌ లక్ష్మణ్‌, అజారుద్దీన్‌ వంటి క్రెటర్లు అనుకరించారు. 

>
మరిన్ని వార్తలు