రొనాల్డొ ‘ధనా’ధన్‌! 

18 Jul, 2018 05:10 IST|Sakshi

 అతడి పేరున్న జెర్సీలు హాట్‌ కేక్‌లు

24 గంటల్లోనే రూ.420 కోట్ల ఆర్జన  

ట్యూరిన్‌ (ఇటలీ): అది వరల్డ్‌ కప్‌ కానీ, ప్రపంచవ్యాప్త లీగ్‌లు కానీ ఫుట్‌బాల్‌ అంటేనే ‘ధనా’ధన్‌! ఎటుచూసినా కోటాను కోట్ల డబ్బు ప్రవహిస్తుంటుంది. ఇక ఇందులో ఆటగాళ్ల ‘విలువ’ గురించి చెప్పేదేముంటుంది. పైగా క్రిస్టియానో రొనాల్డో వంటి ఆల్‌టైమ్‌ దిగ్గజం విషయంలో ప్రతిదీ సంచలనమే. అలాంటి మరో ఘటనే ఇది. ఇటీవలే రూ. 846 కోట్ల బదిలీ ఒప్పందంతో స్పెయిన్‌కు చెందిన రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌ నుంచి ఇటలీకి చెందిన యువెంటస్‌ క్లబ్‌కు మారిన ఈ పోర్చుగల్‌ సారథి... ఆ క్లబ్‌ జట్టు తరఫున బరిలో దిగకుండానే తన ధరలో సగం మొత్తం సంపాదించి పెట్టేశాడు. అదీ ఒక్క రోజులోనే కావడం విశేషం. క్రిస్టియానో రొనాల్డొ పేరును కుదించి, దానికి అతడి నంబరును జోడించి యువెంటస్‌ క్లబ్‌ ‘సీఆర్‌7’ పేరిట జెర్సీలను సోమవారం అమ్మకానికి పెట్టింది.

ఇంకేం... 5 లక్షల 20 వేల జెర్సీలు హాట్‌కేకుల్లా ఎగిరిపోయాయి. వీటిలో 20 వేల జెర్సీలను అభిమానులు యువెంటస్‌ అధికారిక స్పాన్సర్‌ ఆడిడాస్‌ స్టోర్ల నుంచి కొనుగోలు చేయగా, 5 లక్షల జెర్సీలకు ఆన్‌లైన్లో ఆర్డరిచ్చారు. తద్వారా ఒక్క రోజే 5 కోట్ల 40 లక్షల యూరోలు (రూ. 420 కోట్లు) సమకూరాయి. వీటిలో యువెంటస్‌ ప్రామాణిక షర్ట్‌ విలువ 104 యూరోలు (రూ. 8,300) కాగా, రెప్లికా షర్ట్‌ 45 యూరోలు (రూ. 3,600) ఉంటుంది. 2016 సీజన్‌ మొత్తంలో అమ్ముడైన యువెంటస్‌ జెర్సీలే 8.50 లక్షలు కావడం గమనార్హం. మరోవైపు రొనాల్డొ బదిలీ ఫీ 

>
మరిన్ని వార్తలు