జేసన్‌ రాయ్‌ దూకుడు

8 Jun, 2019 16:00 IST|Sakshi

కార్డిఫ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ తనదైన బ్యాటింగ్‌ శైలితో దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ఆదిలో నెమ్మదిగా ఆడిన రాయ్‌..ఆపై బంగ్లా బౌలర్లపై దాడికి దిగాడు. ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. జేసన్‌ రాయ్‌ 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో అర్థ శతకం నమోదు చేశాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా సైఫుద్దీన్‌ వేసిన 12 ఓవర్‌ రెండో బంతిని సిక్స్‌ కొట్టిన రాయ్‌.. ఆ మరుసటి బంతికి ఫోర్‌ కొట్టి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేపట్టింది. దాంతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ను జేసన్‌ రాయ్‌-బెయిరన్‌ స్టోల జోడి ఆరంభించింది. తొలుత పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన వీరిద్దరూ క్రీజ్‌లో కుదురుకున్నాక బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఒకవైపు రాయ్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయగా, బెయిర్‌ స్టో మాత్రం స్టైక్‌ రోటేల్‌ చేస్తూ సింగిల్స్‌ తీయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఫలితంగా 15 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌ వికెట్‌ కోల్పోకుండా వంద పరుగుల మార్కును చేరింది.

మరిన్ని వార్తలు