మాజీ ఆటగాడు ఆర్‌పీ సింగ్‌కు కీలక పదవి

31 Jan, 2020 20:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా మాజీ ఆటగాడు ఆర్‌పీ సింగ్‌ (రుద్రప్రతాప్‌ సింగ్‌)ను కీలక పదవి వరించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం ప్రకటించిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)లో ఆర్‌పీ సింగ్‌కు అనూహ్యంగా చోటుదక్కింది. ముగ్గురు సభ్యుల గల సీఏసీ వివరాలను బీసీసీఐ వెల్లడించింది. వీరిలో మాజీ ఆటగాడు మదల్‌లాల్‌, సులక్షన్‌ నాయక్‌ మూడో సభ్యుడుగా ఆర్‌పీ సింగ్‌ను ఎంపిక చేశారు. వీరి పదవీకాలం ఏడాది కాలం పాటు ఉంటుందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆర్‌పీ సింగ్‌ భారత్‌ తరఫున 14 టెస్ట్‌ మ్యాచ్‌లు, 58 వన్డేలు, 10 టీ-20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 2007లో జరిగిన టీ-20 ప్రపంచ కప్‌లో చోటుదక్కించుకుని.. అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. సుమారు ఆరేళ్ల పాటు వివిధ ఫార్మాట్‌లో టీమిండియాకు సేవలు అందిచిన ఆర్‌సీ సింగ్‌ తన చివరి మ్యాచ్‌ను 2011లో ఆడాడా. కొంతకాలం పాటు ఐపీఎల్‌ మ్యాచ్‌లు కూడా ఆడాడు.
 

>
మరిన్ని వార్తలు