రూ. 63 కోట్ల చేతి ప్రతి! 

11 Feb, 2020 03:24 IST|Sakshi

అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్, రష్యా కోటీశ్వరుడు అలీషర్‌ ఉస్మానోవ్‌ చేతుల్లో కనిపిస్తున్న ఈ రాత ప్రతి విలువ అక్షరాలా రూ. 63 కోట్లు! ఒలింపిక్‌ క్రీడల నిర్వహణపై తన విజన్‌ను చెబుతూ ‘ఆధునిక ఒలింపిక్‌ పితామహుడు’ పియర్రీ డి క్యూబర్టీన్‌ స్వయంగా రాసుకున్న 14 పేజీల డాక్యుమెంట్‌ ఇది. ఇటీవల జరిగిన వేలంలో ఉస్మానోవ్‌ దీనిని 8.8 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 63 కోట్లు)కు సొంతం చేసుకున్నాడు. దానిని ఇప్పుడు లాసానేలోని ఒలింపిక్‌ మ్యూజియంలో ఉంచమంటూ తానే బహుమతిగా అందించాడు. క్రీడల చరిత్రలో వేలం ద్వారా ఒక స్మారకం లేదా జ్ఞాపికకు లభించిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. గతంలో అమెరికా బేస్‌బాల్‌ ఆటగాడు బేబ్‌ రూత్‌ ధరించిన ‘న్యూయార్క్‌ యాంకీస్‌’ టీమ్‌ జెర్సీ 5.64 మిలియన్‌ డాలర్లకు (రూ. 40 కోట్లు) అమ్ముడుపోయింది.

మరిన్ని వార్తలు