ప్రేక్షకులతో రష్యా గ్రాండ్‌ప్రి! 

11 Jul, 2020 01:40 IST|Sakshi

సెప్టెంబర్‌ 27న సోచిలో జరిగే అవకాశం

స్పీల్‌బర్గ్‌ (ఆస్ట్రియా): కరోనా విజృంభణతో నాలుగు నెలలు ఆలస్యంగా ఆరంభమైన ఫార్ములావన్‌ (ఎఫ్‌1) తాజా సీజన్‌లో వీలైనన్ని ఎక్కువ రేసులను నిర్వహించేందుకు నిర్వాహకులు వడివడిగా అడుగులేస్తున్నారు. అంతేకాకుండా ప్రేక్షకులతో నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే తాజా సీజన్‌లో... సెప్టెంబర్‌ 27న సోచి నగరంలో జరిగే రష్యా గ్రాండ్‌ప్రిలో ప్రేక్షకులను అనుమతించే అవకాశముంది.

ఇప్పటికే ఎనిమిది రేసులతో కొత్త క్యాలెండర్‌ను విడుదల చేసిన ఎఫ్‌1 నిర్వాహకులు... తాజాగా వాటికి మరో రెండు రేసులను జోడించారు. ఇటలీలోని ముగెల్లో వేదికగా సెప్టెంబర్‌ 13న టస్కన్‌ గ్రాండ్‌ప్రి, సెప్టెంబర్‌ 27న రష్యా గ్రాండ్‌ప్రి  జరగనున్నాయి. దాంతో ఈ ఏడాది జరిగే రేసుల సంఖ్య పదికి చేరింది. టస్కన్‌ గ్రాండ్‌ప్రి ఎఫ్‌1 క్యాలెండర్‌లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. అంతే కాకుండా ఎఫ్‌1 జట్లల్లో అత్యంత విజయవంతమైన ఫెరారీ జట్టు తమ 1000వ రేసును టస్కన్‌ గ్రాండ్‌ప్రితో పూర్తి చేసుకోనుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా