రుత్విక, బాలు మహేంద్రలకు టైటిల్స్

25 Sep, 2013 23:38 IST|Sakshi

జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండర్-19 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్ టైటిల్‌ను గద్దె రుత్విక శివాని (ఖమ్మం), బాలుర టైటిల్‌ను బాలు మహేంద్ర గెలుచుకున్నారు. తణుకులో బుధవారం ఈ పోటీలు ముగిశాయి.  బాలికల ఫైనల్లో స్కోరు 15-13 ఉన్న దశలో రుత్విక ప్రత్యర్థి, టాప్‌సీడ్ రితుపర్ణదాస్ మ్యాచ్ నుంచి తప్పుకుంది. దీంతో రెండోసీడ్ రుత్వికను విజేతగా ప్రకటించారు. సెమీఫైనల్స్‌లో రుత్విక 21-13, 21-15తో శ్రీ కృష్ణప్రియ (హైదరాబాద్)పై; రితుపర్ణదాస్ 20-22, 21-19, 21-11తో వృశాలి (రంగారెడ్డి)పై విజయం సాధించారు.
 
 బాలుర ఫైనల్లో రెండోసీడ్ బాలు మహేంద్ర (విశాఖపట్నం) 21-9, 20-11, 21-10తో అనీత్ కుమార్ (రంగారెడ్డి)పై నెగ్గాడు. సెమీఫైనల్స్‌లో బాలు మహేంద్ర 21-9, 21-18తో కిరణ్ కుమార్ (రంగారెడ్డి)పై; అనీత్ కుమార్ 21-18, 8-21, 21-5తో చంద్రకుమార్ (తూర్పు గోదావరి)పై విజయం సాధించారు.
 
 బాలికల డబుల్స్‌లో మేఘన-రితుపర్ణదాస్ జోడి 21-15, 21-19తో పూజ-సోనికా సాయిలపై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. బాలుర కేటగిరీలో చైతన్య-గంగాధర్ రావు జంట 21-13, 21-16తో ఉపేందర్-అనిత్ కుమార్ జోడిని ఓడించింది. విజేతలకు భారత బ్యాడ్మింటన్ చీఫ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రోఫీలను అందజేశారు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు