చాంపియన్స్‌ రుతిక్, ఖుషి

23 Jul, 2017 14:25 IST|Sakshi

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) వార్షిక ఓపెన్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో జియాన్‌ స్పోర్ట్స్‌ స్విమ్మర్లు రుతిక్‌ రెడ్డి, ఖుషి బన్సల్‌ సత్తా చాటారు. సికింద్రాబాద్‌లోని గురుమూర్తి స్విమ్మింగ్‌పూల్‌లో జరుగుతోన్న ఈ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు.

 

శనివారం జరిగిన 15 ఏళ్లు పైబడిన బాలుర ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌ను రుతిక్‌ రెడ్డి ఒక నిమిషం 01.33సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలవగా, వై. హేమంత్‌ రెడ్డి (1:02:75 సె.), సమీర్‌ తోమర్‌ (1:08:32 సె.) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. బాలికల విభాగంలో ఖుషి ఈవెంట్‌ను నిమిషం 17:51 సెకన్లలో పూర్తిచేసి తొలి స్థానాన్ని సాధించింది. తేజస్వి పీటర్‌ (1:41:04 సె.), అభిజిత (1:43:66 సె.) తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు.

అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని వివరించారు. వాకింగ్, జిమ్‌తో పాటు స్విమ్మింగ్‌ చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పల తరుణి, ఆకుల రూప, అడిషనల్‌ స్పోర్ట్స్‌ కమిషనర్‌ అర్జిత్‌ కుమార్‌ సింగ్, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ విజయ్‌రాజ్, డీఎంసీ శైలజ, స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ ప్రేమ్‌రాజ్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉమేష్, ఈఈ సురేష్, స్విమ్మింగ్‌ఫూల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కృష్ణ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మెడలిస్ట్‌ విభాగం విజేతల వివరాలు


అండర్‌–8 బ్రెస్ట్‌స్ట్రోక్‌ బాలురు: 1. అభయ్‌ (సిల్వర్‌ ఓక్స్‌), 2 యశస్వ (జియాన్‌ స్పోర్ట్స్‌), 3. వేద్‌ కార్తీక్‌;
బాలికలు: 1. లోహిత (ఎల్బీ స్టేడియం)


అండర్‌–10 బాలుర బ్యాక్‌స్ట్రోక్‌: 1. కె. మనీశ్‌ (జీహెచ్‌ఎంసీ), 2. రాహుల్‌ (శాంతినికేతన్‌), 3. ఎం. నిశాంత్‌ (ఎల్బీ స్టేడియం); బాలికలు: 1. డి. సిరి, 2. ప్రహర్షిత (బీఎస్‌ఆర్‌కేవీ).

అండర్‌–12 బాలుర బటర్‌ఫ్లయ్‌: 1. జగదీశ్‌ వర్మ (సరూర్‌నగర్‌), 2. వైభవ్‌ బాలాజీ (బ్లూ డాల్ఫిన్‌), 3. ధీరజ్‌ (జియాన్‌ స్పోర్ట్స్‌); బాలికలు: 1. జి. కశ్యపి (షార్క్స్‌ ప్రొ), 2. ఆస్థా (ఆర్‌ఆర్‌సీ), 3. ఉరిధి (జియాన్‌ స్పోర్ట్స్‌).

అండర్‌–14 బాలుర బటర్‌ఫ్లయ్‌: 1. కె. సాయి అభిషేక్‌ (జియాన్‌ స్పోర్ట్స్‌), 2. వై. జశ్వంత్‌ రెడ్డి, 3. బి. నిహార్‌ (జియాన్‌ స్పోర్ట్స్‌); బాలికలు: 1. జి. హంసిని (జియాన్‌ స్పోర్ట్స్‌), 2. నందన (బ్లూ డాల్ఫిన్‌).

నాన్‌ మెడలిస్ట్‌ విభాగం విజేతల వివరాలు

అండర్‌–8 బాలురు: 1. సుశాంత్‌ దేశాయ్‌ (ఎల్బీ స్టేడియం), 2. చాణక్య (బ్లూ డాల్ఫిన్‌), 3. తేజస్‌ (హెచ్‌పీఎస్‌ కిడ్స్‌); బాలికలు: 1. వినీల (బ్లూ డాల్ఫిన్‌), 2. దిత్యా చౌదరి (హెచ్‌పీఎస్‌), 3. సాయి ప్రజ్ఞ (జియాన్‌ స్పోర్ట్స్‌).

అండర్‌–10 బాలురు: 1. బి. అభినవ్, 2. డి. వర్షిత్‌ (జియాన్‌ స్పోర్ట్స్‌), 3. ఆదిత్య; బాలికలు: 1. ప్రీతి (షార్క్‌ ప్రొ), 2. ధ్రుతి (ఎల్బీ స్టేడియం), 3. శ్రీయ.

అండర్‌–12 బాలురు: 1. గుణవంత్‌ రెడ్డి (సిల్వర్‌ ఓక్స్‌), 2. ధ్రువ్‌ (షార్క్‌ ప్రొ), 3. తనుశ్‌ (సెయింట్‌ పీటర్స్‌); బాలికలు: 1. సొహిని సిన్హా (మెరిడియన్‌ స్కూల్‌), 2. నందిని (డాల్ఫిన్‌), 3. ఆద్య (గ్లెండాల్‌ అకాడమీ).

మరిన్ని వార్తలు