క్వార్టర్స్‌లో రుత్విక

8 Sep, 2017 00:52 IST|Sakshi
క్వార్టర్స్‌లో రుత్విక

సాక్షి, హైదరాబాద్‌: వియత్నాం ఓపెన్‌ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయిలు గద్దె రుత్విక శివాని, గుమ్మడి వృశాలిలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రుత్విక క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించగా... వృశాలి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పోరాడి ఓడింది. వియత్నాంలోని హో చి మిన్‌ సిటీలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రుత్విక 21–15, 21–12తో వాన్‌ యి తాంగ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలుపొందింది. వృశాలి 8–21, 21–12, 10–21తో ఆరో సీడ్‌ చెన్‌ సు యు (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలైంది.

భారత్‌కే చెందిన శ్రేయాన్షి పరదేశి 6–21, 21–16, 21–23తో మూడో సీడ్‌ దినార్‌ అయుస్టిన్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో లక్ష్య సేన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ 21–14, 21–12తో త్రుయోంగ్‌ తన్‌ లాంగ్‌ (వియత్నాం)పై గెలుపొందాడు. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో దినార్‌తో రుత్విక శివాని; కొడాయ్‌ నరావుకా (జపాన్‌)తో లక్ష్య సేన్‌ తలపడతారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా