స్విమ్మర్ లోక్టేపై సస్పెన్షన్ వేటు!

8 Sep, 2016 16:17 IST|Sakshi
స్విమ్మర్ లోక్టేపై సస్పెన్షన్ వేటు!

న్యూయార్క్: రియో ఒలింపిక్స్ సందర్భంగా తనతో పాటు కొంతమంది అమెరికా స్విమ్మర్లు దోపిడీకి గురయ్యామంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన ర్యాన్ లోక్టేపై పది నెలల నిషేధం పడింది. తక్షణమే అమల్లోకి వచ్చే ఈ నిషేధం వచ్చే సంవత్సరం మధ్య వరకూ కొనసాగనున్నట్లు యూఎస్ పత్రిక పేర్కొంది.  అయితే ఈ ఉదంతంలో ఇరుక్కున మరో ముగ్గురు స్విమ్మర్లపై నాలుగు నిషేధం మాత్రమే విధిస్తూ యునైటెడ్ స్టేట్స్ ఒలింపిక్ కమిటీ(యూఎస్ఓసీ) నిర్ణయం తీసుకున్నట్లు ఆ పత్రిక పేర్కొంది.

ఈ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన లోక్టే..  ఆ మెగా ఈవెంట్ సందర్భంగా తనతో పాటు,  ముగ్గురు సహచర స్మిమ్మర్లు ఓ రాత్రి కారులో వెళుతున్నప్పుడు కొంతమంది దుండగులు అడ్డగించి తమ వద్దనున్న కొన్ని విలువైన వస్తువులు దోచుకెళ్లారంటూ ఆరోపించాడు. దీనిపై సీరియస్గా స్పందించిన బ్రెజిల్ అధికారులు విచారణ చేపట్టగా, లోక్టే తప్పుడు ఫిర్యాదు చేసినట్లు రుజువైంది. లోక్టే చేసిన ఆరోపణల్ని కట్టుకథగా నిరూపించడంతో అతను భారీ జారీమానా చెల్లించుకోవాల్సివచ్చింది..దాంతో పాటు పలు వాణిజ్య సంస్థలు  లోక్టేతో స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు