సచిన్-కోహ్లిల మధ్య పోలిక ఎందుకు?

9 Apr, 2016 22:09 IST|Sakshi
సచిన్-కోహ్లిల మధ్య పోలిక ఎందుకు?

కోల్కతా: మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో విరాట్ కోహ్లిని  పోల్చడం ఎంతమాత్రం సరికాదని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేర్కొన్నాడు. అసలు సచిన్తో విరాట్ను పోల్చాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించాడు. 'సచిన్ ఒక లెజండ్ ఆటగాడు. విరాట్ ఇంకా  ఆరంభంలోనే ఉన్నాడు. అటువంటప్పుడు వారి మధ్య పోలిక అనవసరం' అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.

వరల్డ్ టీ 20లో భారత్ను ఫైనల్ కు చేర్చడంలో విఫలమైన మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగొతేనే మంచిదని భావిస్తున్నారా?అన్న ప్రశ్నకు కపిల్ దేవ్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. కెప్టెన్ ను మార్చాలన్నది సెలక్టర్ల నిర్ణయమన్నాడు. ఒకవేళ వారు మార్చాలనుకుంటూ మార్పు ఉంటుందన్నాడు. అయితే ధోని అనేకసార్లు విజయవంతమైన కెప్టెన్ గా నిరూపించుకున్న సంగతిని మరువకూడదని కపిల్ ఈ సందర్భంగా తెలిపాడు.

మరిన్ని వార్తలు