సచిన్ ఒక్కడే..

27 Jun, 2016 16:35 IST|Sakshi
సచిన్ ఒక్కడే..

లండన్:న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ తన ఆల్ టైమ్ క్రికెట్ జట్టులో  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు స్థానం కల్పించాడు. తాజాగా మెకల్లమ్ విడుదల చేసిన క్రికెట్ ఎలివన్లో భారత్ నుంచి సచిన్కు ఒక్కడికే స్థానం దక్కింది. అయితే నలుగురు ఆస్టేలియా ఆటగాళ్లకు మెకల్లమ్ ఆల్ టైమ్ ఎలివన్లో చోటు దక్కింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ఆడమ్ గిల్క్రిస్ట్, షేన్ వార్న్, మిచెల్ జాన్సన్లు ఉన్నారు.

 

మరోవైపు వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్ కు వెస్టిండీస్ నుంచి స్థానం కల్పించగా, న్యూజిలాండ్ నుంచి టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్లను మాత్రమే మెకల్లమ్ ఎన్నుకున్నాడు. దక్షిణాఫ్రికా నుంచి జాక్వస్ కల్లిస్కు ఒక్కడికి తన జట్టులో  స్థానం కల్పించాడు. అయితే క్రిస్ గేల్, సచిన్లను ఓపెనర్లుగా ఎంచుకోగా,  రికీ పాంటింగ్కు మూడో స్థానాన్ని కేటాయించాడు.. ఆ తరువాత స్థానల్లో లారా, రిచర్డ్స్లుండగా, ఏడో స్థానాన్ని ఆడమ్ గిల్ క్రిస్ట్ కు ఇచ్చాడు. ఆరో స్థానాన్ని తనకే కేటాయించుకున్నాడు మెకల్లమ్.

>
మరిన్ని వార్తలు