సైలెంట్‌ వారియర్‌కు సచిన్‌ విషెస్‌

25 Jan, 2018 14:30 IST|Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ టీమిండియా సైలెంట్‌ వారియర్‌.. ఛటేశ్వర పుజారాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

గురువారం(జనవరి 25) పుజారా పుట్టిన రోజు సందర్భంగా సచిన్‌ తన ట్వీటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘టీమిండియా సైలెంట్‌ వారియర్‌ పుజారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో అతను రాణించాలని కోరుకుంటున్నా’’ అని సచిన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

కాగా, ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీమిండియా మూడో టెస్ట్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు