సచిన్‌ తర్వాతే ఎవరైనా...

28 Aug, 2019 19:31 IST|Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ)పై సచిన్‌ టెండూల్కర్‌ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను అన్ని ఫార్మాట్‌లలో గొప్ప క్రికెటర్‌గా కీర్తిస్తూ ఐసీసీ ట్వీట్‌ చేయడాన్ని సచిన్‌ ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. సచిన్‌ తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ విజయం తర్వాత బెన్‌ స్టోక్స్‌ను అన్ని ఫార్మాట్‌లలో గొప్ప క్రికెటర్‌గా కీర్తిస్తూ సచిన్‌తో ఉన్న అతడి ఫొటోను ఐసీసీ ట్వీట్‌ చేసింది. తాజాగా యాషెస్‌ మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో సంచలన సెంచరీతో ఇంగ్లండ్‌ను స్టోక్స్‌ గెలిపించిన నేపథ్యంలో పాత ట్వీట్‌ను మళ్లీ ఐసీసీ షేర్‌ చేసింది. 

ఐసీసీ ట్వీట్‌పై అభిమానులు స్పందిస్తూ.. సచిన్‌ను మించిన గొప్ప క్రికెటర్‌ ఎవరూ లేరని వ్యాఖ్యానిస్తున్నారు. 90 దశకం చివర్లో ఎన్నోసార్లు మొత్తం టీమిడింయా భారాన్ని సచిన్‌ తన భుజాలపై మోసాడని గుర్తు చేస్తున్నారు. అప్పటికి, ఇప్పటికి తేడా ఏమిటంటే అప్పట్లో ట్విటర్‌ లేకపోవడమేనని చురక అంటించారు. ఐసీసీ ట్వీట్‌ భయంకరంగా ఉందని మరో అభిమాని కామెంట్‌ చేశారు. ఇటువంటి పనికిమాలిన ట్వీట్‌ చేసినం‍దుకు ఐసీసీపై కఠిన చర్య తీసుకుని, సస్పెండ్‌ చేయాలని మరొకరు వ్యాఖ్యానించారు. (చదవండి: 96 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌..)

Poll
Loading...
మరిన్ని వార్తలు