ఒత్తిడికి తలొగ్గొద్దు

21 May, 2014 01:12 IST|Sakshi
ఒత్తిడికి తలొగ్గొద్దు

సానుకూల దృక్పథంతో ఆడాలి
 భారత హాకీ జట్టుకు సచిన్ సూచనలు
 
 న్యూఢిల్లీ: ‘జట్టుగా మనం ఎంత బలంగా ఉంటే ఒత్తిడిని అంత బాగా జయించొచ్చు. మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే తీరు కూడా చాలా ముఖ్యం. ప్రతి మ్యాచ్‌కు ఇది భిన్నంగా ఉండొచ్చు. ప్రత్యర్థుల బలం, బలహీనతలకు తగ్గట్టుగా మనం సిద్ధం కావాలి. ప్రతి మ్యాచ్‌ను సానుకూల దృక్పథంతో మొదలుపెట్టాలి. ఏ జట్టయినా మనకంటే బలమైంది కాదనే భావన మనలో నాటుకుపోవాలి. ఆలోచనలూ సానుకూలంగానే ఉండాలి.
 
 మనసులో ఇవే ఆలోచనలు తిరుగుతూ ఉండాలి. అప్పుడు శరీరం కూడా దీటుగా ప్రతిస్పందిస్తుంది’ హాకీ ప్రపంచకప్‌కు ఎంపికైన భారత జట్టుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సలహాలివి. హాకీ కెప్టెన్ సర్ధార్ సింగ్ విజ్ఞప్తి మేరకు మంగళవారం జట్టును కలిసిన మాస్టర్.. దాదాపు రెండు గంటలపాటు తన అనుభవాలను పంచుకున్నాడు. మాస్టర్ వస్తున్న విషయాన్ని 10 రోజుల కిందట చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్, హై ఫెర్ఫార్మెన్స్ డెరైక్టర్ రోలెంట్ ఆల్టమస్‌లకు చెప్పినా... జట్టు సహచరుల వద్ద మాత్రం రహస్యంగా ఉంచానని సర్ధార్ సింగ్ చెప్పాడు.
 

మరిన్ని వార్తలు