సచిన్ నా ఫేవరెట్ క్రికెటర్: వివియన్ రిచర్డ్స్

1 Feb, 2015 20:49 IST|Sakshi
సచిన్ నా ఫేవరెట్ క్రికెటర్: వివియన్ రిచర్డ్స్

ఆంటిగ్వా:వివియన్ రిచర్డ్స్.. ఒకప్పటి వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం. ఆ ఆటగాడు బరిలో దిగేడంటే ప్రత్యర్థులకు వణుకే. మరి అటువంటి క్రికెటర్ కు సచిన్ టెండూల్కర్ ఆటంటే చాలా ఇష్టమట. అతనే తన ఫేవరెట్ ఆటగాడిని రిచర్డ్స్ తాజాగా స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి రాసిన కాలమ్ లో రిచర్డ్స్ ఈ విషయాలను స్పష్టం చేశాడు. ఆల్ టైం గ్రేట్ క్రికెటర్లలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్థానం దక్కించుకోవడంలో ఎటువంటి ఆశ్యర్యం లేదన్నాడు

 

 ఆల్ టైం వన్డే 10 మంది క్రికెటర్లలో రిచర్డ్స్ స్థానాన్ని సచిన్ అధిగమించాడు. దీనిపై స్పందించిన రిచర్డ్స్..  'నేను సచిన్ కు ఫేవరెట్ ఆటగాడిని. ఒక్క మాటలో చెప్పాలంటే సచిన్ క్రికెట్ లెజెండ్. అతని మ్యాచ్ లను డబ్బులు చెల్లించి మరీ చూసేవాడినన్నాడు.

మరిన్ని వార్తలు