‘కోచ్‌ వస్తున్న సంగతి సచిన్‌ చెప్పలేదు..’

3 Aug, 2019 19:26 IST|Sakshi

ముంబై : క్రికెట్‌ లెజెండ్‌, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ పాఠశాల స్మృతుల్ని గుర్తుచేసుకున్నాడు. తన స్కూల్‌మేట్‌, టీమిండియా మాజీ క్రెకెటర్‌ వినోద్‌ కాంబ్లీతో ఉన్న ఓ పాత ఫొటోను ట్విటర్‌లో శనివారం పోస్టు చేశాడు. తన స్నేహితుడు కాంబ్లీని ముద్దుగా ‘కాంబ్ల్యా’అని పిలుచుకునే సచిన్‌.. ‘‘కాంబ్ల్యా’ ఈ ఫొటో సంపాదించాడు. ఆ పాత చిలిపి జ్ఞాపకాలు మదిలో మెదిలేలా చేశాడు. స్కూల్‌ డేస్‌ అన్నీ ఒక్కసారే కళ్లముందు కదలాడాయి’ అని ట్విటర్‌ పేర్కొన్నాడు. స్పందించిన కాంబ్లీ.. ఆ ఫొటో వెనకున్న కథ విప్పాడు 

‘మాస్టర్‌..! నేనూ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ కైట్‌ వచ్చి పిచ్‌ మధ్యలో పడింది. దాన్ని పక్కన పడేసి నా పని నేను చూసుకోకుండా... ఎగరేయడం మొదలెట్టాను. అది గమనించిన మా కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌ నావైపు కోపంగా వస్తున్నారు. ఆయన వస్తున్నది నేను గమనించలేదు. సార్‌ రావడం చూసినప్పటికీ నువ్‌ నాకు చెప్పలేదు. అంతే, తర్వాతేం జరగిందో తెలుసుగా..’అని ట్వీట్‌ చేశాడు.
(చదవండి : సచిన్, కాంబ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్‌)

ఇక ఈ ఇద్దరు మాజీ ఆటగాళ్లు శారదాశ్రమం విద్యామందిర్‌లో పాఠశాల విద్య చదివారు. కోచ్‌ ఆచ్రేకర్‌ సూచన మేరకే వారు ఆ స్కూళ్లో చేరడం గమనార్హం. పాఠశాల స్థాయి క్రికెట్‌ టోర్నీలో 1988, ఫిబ్రవరిలో జరిగిన ఓ మ్యాచ్‌లో 664 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. హరీస్‌ షీల్డ్‌ టోర్నీలో సెయింట్‌ జేవియర్‌ స్కూల్‌పై ఈ ఘనత సాధించారు. సచిన్‌ 326 పరుగులు చేయగా.. కాంబ్లీ 349 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు