సవాల్‌ విసిరిన సచిన్‌.. వారం రోజులే గడువు!

22 Jan, 2020 09:14 IST|Sakshi

ముంబై: లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన ఆప్త మిత్రుడు వినోద్‌ కాంబ్లికి ఓ సవాల్‌ విసిరాడు. అంతేకాకుండా ఆ చాలెంజ్‌ను కేవలం ఏడు రోజుల్లో పూర్తి చేయాలని మరో మెలిక పెట్టాడు. అయితే సచిన్‌ సవాల్‌ను కాంబ్లి స్వీకరించాడు. వారం రోజుల్లో సచిన్‌ చెప్పిన పనిని పూర్తి చేస్తానని కాంబ్లి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ ఆ చాలెంజ్‌ ఏంటంటే.. గతంలో బాలీవుడ్‌ సింగర్‌ సోనూ నిగమ్‌తో కలిసి సచిన్‌ 'క్రికెట్ వాలీ బీట్ పే' అనే సాంగ్‌ను పాడిన విషయం తెలిసిందే. అయితే ఆ పాటకు కేవలం ఏడు రోజుల్లో ర్యాప్‌ చేయాలని కాంబ్లికి సచిన్‌ సవాల్‌ విసిరాడు. ఈనెల 28 లోపూ ‘క్రికెట్‌ వాలీ బీట్‌ పే’కు ర్యాప్‌ సాంగ్‌ పాడకుంటే కాంబ్లి తనకు ఏదో రుణపడి ఉంటాడని సచిన్‌ పేర్కొన్నాడు. 

ప్రస్తుతం వీర్దిదరి సంభాషణలకు సంబంధించిన వీడియోను సచిన్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక 2017లో  'క్రికెట్ వాలీ బీట్ పే' సాంగ్‌ క్రికెట్‌ అభిమానులతో పాటు సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సాంగ్‌ను టీమిండియా తరుపున ప్రపంచకప్‌ ఆడిన ఆటగాళ్లకు అంకితమిస్తున్నట్టు సచిన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, స్కూల్‌ క్రికెట్‌లో సచిన్‌-కాంబ్లిలు 664 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి అప్పట్లో చరిత్ర సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. 
 

చదవండి: 
వడా పావ్‌ ఎలా తినాలో చెప్పిన సచిన్‌
ధావన్‌ స్థానంలో పృథ్వీ షా

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోహిత్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ..

రెండేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన గంభీర్‌

‘ట్రంప్‌లాగే ఆలోచించవద్దు.. ప్రాణాలే ముఖ్యం’

వేలానికి బట్లర్‌ ప్రపంచకప్‌ జెర్సీ

హాకీ ఇండియా, ఏఐఎఫ్‌ఎఫ్‌ విరాళం రూ. 25 లక్షలు

సినిమా

పవన్‌ కల్యాణ్‌ను నిలబెట్టిన చిత్రం..

‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నా: హీరోయిన్‌

వైర‌ల్ అవుతున్న క‌రోనా సాంగ్‌

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై