ఈ శతాబ్దపు ఉత్తమ క్రికెటర్ సచిన్

26 Jun, 2015 02:40 IST|Sakshi
ఈ శతాబ్దపు ఉత్తమ క్రికెటర్ సచిన్

సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో 21వ శతాబ్దపు ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. 2000 సంవత్సరంనుంచి ప్రదర్శన ప్రకారం 23 శాతం అభిమానులు సచిన్‌కు ఓటు వేయగా, ఆసీస్ స్టార్ పాంటింగ్ (11%)కు నాలుగో స్థానం మాత్రమే దక్కింది. సంగక్కర, గిల్‌క్రిస్ట్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. మరోవైపు సచిన్‌ను ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) తమ క్రికెట్ అభివృద్ధి కమిటీలోకి తీసుకుంది. ముంబైలో క్రికెట్ అభివృద్ధికి మాస్టర్ తోడ్పడతాడని ఎంసీఏ తెలిపింది.

మరిన్ని వార్తలు