పుజారాకు సచిన్‌ వెరైటీ విషెస్‌

25 Jan, 2020 14:50 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్‌ చతేశ్వర పుజారా శనివారం 32వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తాజా, మాజీ సహచర క్రికెటర్లు అతడికి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే పుజారా బర్త్‌డే సందర్భంగా లెజండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ గుజరాతీ భాషలో పుజారాకు విషెస్‌ తెలపడం విశేషం. ‘పుజారాను ఔట్‌ చేయాలంటే పూజారి ఆశీర్వాదాలు కావాలి. హ్యాపీ బర్త్‌డే పుజారా’అంటూ సచిన్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఇక చతేశ్వర పుజారా గుజరాత్‌కు చెందిన క్రికెటర్‌ కావడంతో సచిన్‌ అతడి లాంగ్వేజ్‌లోనే ట్వీట్‌ చేశాడు. 

సచిన్‌తో పాటు బీసీసీఐ కూడా పుజారాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. అద్భుతమైన బ్యాటింగ్‌ టెక్నిక్‌కు, ప్రశాంతతకు మారుపేరైన పుజారాకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ఇక వృద్దిమాన్‌ సాహా, మయాంక్‌ అగర్వాల్‌, అశ్విన్‌, మహ్మద్‌ కైఫ్‌, తదితర క్రికెటర్లు పుజారాకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. పుజారా టీమిండియా తరుపున ఇప్పుటివరకు 75 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. లాంగ్‌ ఫార్మాట్‌లో 5741 పరుగులు సాధించగా అందులో 18 సెంచరీలు, 24 హాఫ్‌ సెంచరీలు ఉండటం విశేషం. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా