ఆ తీర్పును కొట్టేయండి: వివేక్‌

15 Mar, 2018 10:58 IST|Sakshi

హైకోర్టులో వివేక్, శేష్‌ నారాయణ్‌లు పిటిషన్లు

నేడు విచారించనున్న హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: తమపై అనర్హత వేటు వేస్తూ హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి ఈ నెల 8న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష, కార్యదర్శులుగా వ్యవహరించిన జి.వివేక్, టి.శేష్‌ నారాయణ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. అంబుడ్స్‌మన్‌ తీర్పుపై వీరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తిస్థాయి వాదనల నిమిత్తం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అంబుడ్స్‌మన్‌ ముందు వివేక్‌కు వ్యతిరేకంగా మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ తదితరులు పిటిషన్‌ దాఖలు చేశారు. శేష్‌ నారాయణ్‌కు వ్యతిరేకంగా సాగర్‌ క్రికెట్‌ క్లబ్‌ కార్యదర్శి బాబూరావు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ నర్సింహారెడ్డి, హెచ్‌సీఏకు అధ్యక్షుడిగా ఉన్న వివేక్, హెచ్‌సీఏతో వాణిజ్యపరమైన ఒప్పందం ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించడం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందంటూ ఈ నెల 8న తీర్పునిచ్చారు. అలాగే హెచ్‌సీఏ అవినీతి కేసుల్లో దాఖలైన చార్జిషీట్‌ల్లో శేష్‌ నారాయణ్‌ పేరు ఉన్నందున ఆయన కార్యదర్శిగా కొనసాగడానికి వీల్లేదని జస్టిస్‌ నర్సింహారెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. తమ తమ విషయాల్లో అంబుడ్స్‌మన్‌ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఇరువురు కూడా తమ పిటిషన్‌లలో కోర్టును కోరారు. విశాక ఇండస్ట్రీస్‌తో తనకున్న సంబంధాలరీత్యా తన కంపెనీకీ, హెచ్‌సీఏకు మధ్య ఉన్న వివాదంపై తీసుకునే నిర్ణయాల్లో తాను పాలు పంచుకోనని, ఈ విషయంలో మార్గదర్శకం చేయాలని అంబుడ్స్‌మన్‌/హెచ్‌సీఏ ఎథిక్స్‌ ఆఫీసర్‌ను రాతపూర్వకంగా కోరానని, అయితే ఇప్పటి వరకు దానిపై ఆయన స్పందించకపోగా... ఇప్పుడు తనను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారని వివేక్‌  తెలిపారు.


తాను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అనర్హుడినని ప్రకటించడానికి తాను ప్రభుత్వ సలహాదారుగా ఉండటాన్ని కూడా అంబుడ్స్‌మన్‌ కారణంగా చూపారని, వాస్తవానికి ఈ విషయం అంబుడ్స్‌మన్‌ న్యాయ పరిధికి సంబంధించింది కాదని ఆయన స్పష్టం చేశారు. లోధా కమిటీ సిఫారసుల ప్రకారం చార్జిషీట్‌లో పేరు ఉన్న వ్యక్తికి అనర్హత వర్తిస్తుందని ఎక్కడా చెప్పలేదని శేష్‌ నారాయణ్‌ తన పిటిషన్‌లో వివరించారు. ఈ విషయాన్ని అంబుడ్స్‌మన్‌ పట్టించుకోలేదన్నారు. చార్జ్‌షీట్‌లో పేరున్నంత మాత్రాన అనర్హుడిగా ప్రకటించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. కాబట్టి అంబుడ్స్‌మన్‌ తీర్పును కొట్టేయాలని కోరారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందుకే రిటైర్మెంట్‌పై ధోని వెనకడుగు!

టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి..

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్‌

నేను సెలక్ట్‌ అవుతాననే అనుకున్నా: శుబ్‌మన్‌

టీమిండియా కోచ్‌ రేసులో జయవర్థనే..!

అదే టర్నింగ్‌ పాయింట్‌: కృనాల్‌

గేల్‌ దూరం.. పొలార్డ్‌కు చోటు

లక్ష్యం ఒలింపిక్స్‌

పేస్‌-రియాల వివాదం.. మరో ఏడాది గడువు!

జాడ లేని భారత టీటీ కోచ్‌!

మనీషా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

నిబంధనలకు విరుద్ధంగా క్రికెట్‌ నియామకాలు

ఆ మ్యాచ్‌ తర్వాత వన్డేలకు మలింగ గుడ్‌బై

మనోళ్ల సత్తాకు పరీక్ష 

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ పంజా

శ్రీజ తీన్‌మార్‌

టోక్యో ఎంత దూరం?

యు ముంబా చిత్తుచిత్తుగా

బీసీసీఐలో భగ్గుమన్న విభేదాలు

సైన్యంలోకి ధోని.. మాజీ క్రికెటర్‌ ఎగతాళి

‘ఆ క్రెడిట్‌ అంతా గంభీర్‌దే’

‘రిటైర్‌ అవ్వను.. అందుబాటులో ఉండను’

‘ఇక పాక్‌ క్రికెట్‌ జట్టును నేను సెట్‌ చేస్తా’

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

ఓడితే బ్యాట్‌ పట్టుకునే వాడిని కాదు: ఇంగ్లండ్‌ క్రికెటర్‌

సచిన్‌ సూచనకు ఓటేసిన బౌలింగ్‌ కోచ్‌

కేదార్‌ జాదవ్‌ ఎందుకు బాస్‌?

ధోని దరఖాస్తుకు ఆమోద ముద్ర!

శుబ్‌మన్‌ గిల్‌ టాప్‌ లేపాడు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!