వికెట్ల వెనుక మా సూపర్‌మ్యాన్‌ నువ్వే..!

24 Oct, 2019 14:13 IST|Sakshi

న్యూఢిల్లీ: తన 35వ పుట్టినరోజుని జరుపుకుంటున్న టీమిండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు క్రికెటర్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేసిన సాహా విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రధానంగా వికెట్ల వెనుక తనదైన ముద్రను కనబరిచి శభాష్‌ అనిపించాడు. ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లతో తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్న సాహా..  ఈరోజు(అక్టోబర్‌ 24)తో 35 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నాడు. దీనిలో భాగంగా భారత క్రికెట్‌  కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)..సాహాకు విషెష్‌ తెలియజేసింది. 

‘ వృద్ధిపాప్స్‌..  కీప్‌ స్టెచింగ్‌.. కీప్‌ క్యాచింగ్‌’ అంటూ అభినందనలు తెలిపింది. ఇక బెంగాల్‌ ఆటగాడు మనోజ్‌ తివారీ ప్రత్యేక అభినందలు తెలిపాడు. ‘ సాహాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. వికెట్ల వెనుక మా సూపర్‌మ్యాన్‌ నువ్వు. నీ పనిని సమర్ధవంతంగా ఇలానే నిర్వర్తించు. రాబోవు సంవత్సరం మరింత ఆనందమయం కావాలి.. అదే సమయంలో సక్సెస్‌తో హ్యాపీగా ఉండాలి’ అని తివారీ ట్వీట్‌ చేశాడు. ‘ హ్యాపీ బర్త్‌డే సాహా. చాలా వికెట్లను క్యాచ్‌ల రూపంలో అందుకుంటున్న నీకు మరింత సంతోషం, అదృష్టం కలిసి రావాలి. హేవ్‌ ఏ గ్రేట్‌ డే’ అని మయాంక్‌ అగర్వాల్‌ తన ట్వీట్‌లో విషెష్‌ తెలిపాడు.

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ద్వారా సాహా పునరాగమం చేసిన సంగతి తెలిసిందే. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ నిరాశ పరుస్తూ ఉండటంతో సాహాను జట్టులోకి తీసుకున్నారు.  తనపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ మరొకసారి అత్యుత్తమ వికెట్‌ కీపర్‌గా నిరూపించుకున్నాడు. వికెట్ల వెనుక ఎంతో చురుకుదనంతో కదులుతూ అసాధారణ క్యాచ్‌లతో అలరించాడు. దక్షిణాఫ్రికాను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీపర్‌గా సాహా ప్రత్యేక ముద్ర కనబరిచాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా