సహజశ్రీకి డబ్ల్యూఐఎం హోదా

30 Jul, 2019 10:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి మహిళా అంతర్జాతీయ మాస్టర్‌ (డబ్ల్యూఐఎం)గా కరీంనగర్‌ అమ్మాయి చొల్లేటి సహజశ్రీ అవతరించింది. తాజాగా చెక్‌ రిపబ్లిక్‌ వేదికగా జరిగిన చెక్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీలో పాల్గొన్న ఆమె మెరుగైన ప్రదర్శన కనబరిచి చివరిదైన మూడో డబ్ల్యూఐఎం నార్మ్‌తోపాటు తొలి మహిళా గ్రాండ్‌మాస్టర్‌ (డబ్ల్యూజీఎం) నార్మ్‌ను సంపాదించింది. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన  తెలంగాణ తొలి మహిళా చెస్‌ ప్లేయర్‌గా నిలిచింది. చెక్‌ ఓపెన్‌లో 9 రౌండ్ల పాటు పోటీలు జరగగా... సహజశ్రీ 5 పాయింట్లు సాధించి 102వ స్థానంతో టోర్నీని ముగించింది. ఈ టోర్నీలో భాగంగా ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లతో తలపడిన సహజశ్రీ మెరుగైన ఫలితాలు సాధించింది.

తొలి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కార్తీక్‌ వెంకటరామన్‌పై గెలుపొంది, రష్యా జీఎం సెర్గీ డోమోగెవ్‌తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్‌ గేమ్‌ను డ్రా చేసుకుంది. ఓవరాల్‌గా మూడు గేముల్లో గెలుపొంది, రెండు గేముల్లో పరాజయం పాలైంది. మిగతా నాలుగు గేముల్ని డ్రాగా ముగించింది.   

, ,

మరిన్ని వార్తలు