ప్రిక్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌

1 Jun, 2017 00:02 IST|Sakshi
ప్రిక్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌ సాయిప్రణీత్, సౌరభ్‌ వర్మ... మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, సాయి ఉత్తేజిత రావు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్‌లో సాయిప్రణీత్‌ 21–15, 21–13తో సతీశ్‌థరన్‌ (మలేసియా)పై, సౌరభ్‌ 21–17, 20–22, 21–14తో ఆనంద్‌ పవార్‌ (భారత్‌)పై గెలిచారు. అయితే కశ్యప్, ప్రతుల్‌ జోషి, శుభాంకర్‌ డే రెండో రౌండ్‌లోనే ఓడిపోయారు.

మరోవైపు మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రెండో సీడ్‌ సైనా 21–5, 21–10తో మార్టినా రెపిస్కా (స్లొవేకియా)పై, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి సాయి ఉత్తేజిత 13–21, 24–22, 27–25తో జెస్సికా ముల్జాతి (ఇండోనేసియా)పై నెగ్గారు. శ్రీకృష్ణప్రియ, రుత్విక శివాని, శైలి రాణే, రితూపర్ణ దాస్, రేష్మా కార్తీక్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

సినిమా

కాజోల్‌, నైసా బాగున్నారు: అజయ్‌ దేవ్‌గణ్‌

సల్మాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

తారలు.. ఇంట్లో ఉన్న వేళ..

కరోనా విరాళం

చైనాలో థియేటర్స్‌ ప్రారంభం

జూన్‌లో మోసగాళ్ళు