విజేతలు సాయి ప్రసాద్, ప్రశంస

21 Oct, 2019 10:05 IST|Sakshi

తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టి. సాయి ప్రసాద్, బి. ప్రశంస టైటిళ్లను కైవసం చేసుకున్నారు. చేతన్‌ ఆనంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో టాప్‌ సీడ్‌ సాయి ప్రసాద్‌ (రంగారెడ్డి) 21–10, 21–16తో టి. జ్ఞాన దత్తు (రంగారెడ్డి)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. బాలికల టైటిల్‌ పోరులో రెండో సీడ్‌ ప్రశంస (ఖమ్మం) 21–18, 10–21, 21–15తో టాప్‌ సీడ్‌ ఎన్‌. దీప్షిక (రంగారెడ్డి)ను కంగుతినిపించింది.

బాలుర డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ వర్షిత్‌ (ఖమ్మం)–రోహన్‌ కుమార్‌ (రంగారెడ్డి) ద్వయం 21–11, 21–10తో రెండో సీడ్‌ అభినవ్‌ గార్గ్‌ (హైదరాబాద్‌)–Ôౌర్య కిరణ్‌ (వరంగల్‌) జోడీపై నెగ్గింది. బాలికల డబుల్స్‌ తుది పోరులో మూడో సీడ్‌ షగుణ్‌ సింగ్‌–సృష్టి (రంగారెడ్డి) జంట 18–21, 21–19, 21–11తో టాప్‌ సీడ్‌ కె. వెన్నెల (హైదరాబాద్‌)–ప్రశంస (ఖమ్మం) జోడీకి షాకిచ్చింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి! 

ఐపీఎల్‌ కన్నా ప్రాణం మిన్న

సఫారీ ఆటగాళ్లంతా సేఫ్‌ 

మీ మద్దతు కావాలి

ఆ క్షణం ఇంకా రాలేదు

సినిమా

నవ్వులతో రెచ్చిపోదాం

నాలుగు వేడుకల పెళ్లి

పని పంచుకోండి

ఎంతో నేర్చుకున్నా

జోడీ కుదిరిందా?

గురి మారింది