సాయిప్రసాద్ సంచలన బౌలింగ్

2 Aug, 2016 09:01 IST|Sakshi
సాయిప్రసాద్ సంచలన బౌలింగ్

అభినవ్ కోల్ట్స్ బౌలర్ ఘనత
ఎ-డివిజన్ వన్డే లీగ్

 
హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో అభినవ్ కోల్ట్స్ బౌలర్ సాయి ప్రసాద్ (8/8) చెలరేగాడు. అద్భుతమైన స్పెల్‌తో సదర్న్ స్టార్స్ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. దీంతో అభినవ్ కోల్ట్స్ జట్టు 234 పరుగుల భారీ తేడాతో సదర్న్‌పై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్ట్స్ జట్టు 42.1 ఓవర్లలో 284 పరుగులు చేసింది. అజ్మత్ అలీ (114) సెంచరీ సాధించగా, సంతోష్ 42 పరుగులు చేశాడు. తర్వాత సదర్న్ స్టార్స్ 12.2 ఓవర్లలోనే 50 పరుగులకే ఆలౌటైంది. సాయిప్రసాద్ ధాటికి ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు

శాంతి ఎలెవన్: 238/9 (సుజిత్ 50, సాయి సిద్ధార్థ్ 41; ధీరజ్ 4/45, గౌరీశంకర్ 3/86), సత్య సీసీ: 66 (సాయి కిరణ్ 4/23, మనోజ్ కుమార్ 4/25).
 కన్సల్ట్ సీసీ: 156/8 (భాను 106, భరత్ 54; అఖిల్ 3/29, సాయి 3/30), విజయ్ సీసీ: 157/5 (శితికంఠ 59; కరణ్ 3/17).
 హైదరాబాద్ జిల్లా: 56 (నాగ నితిన్ 5/13, వల్లభ్ రెడ్డి 3/13), పికెట్ సీసీ: 57/0 (ప్రద్యుమ్న 45 నాటౌట్).
 విజయ్‌నగర్ సీసీ: 42 (శేషగిరి 5/15, చరణ్‌తేజ 3/18), ఎస్‌యూసీసీ: 45/5 (రాకేశ్ 4/10).
మహేశ్ సీసీ: 272/9 (శేఖర్ 98, నరేశ్ 51; గోపి 5/37, తృప్త్ 3/59), ఎంపీ స్పోర్టింగ్: 157/9 (వినీత్ 60 నాటౌట్; అవినాశ్ 4/27).
  యూత్ సీసీ: 44 (జెరోమ్ అరోకినాథన్ 6/14), సాక్రెడ్ హార్ట్స్: 45/1 (జేమ్స్ ఆంథోని 31 నాటౌట్).
  మహావీర్ సీసీ: 293/3 (ప్రేమ్‌సుందర్ 122; అనుజ్ యాదవ్ 3/70), గ్రీన్‌లాండ్స్: 167 (అనుజ్ 62; రాజీవ్ శర్మ 3/17).
 

మరిన్ని వార్తలు